Skip to main content

Namaste NRI

అమెరికాలో తగ్గుతున్న క్రైస్తవ మతస్థులు

అగ్రరాజ్యం అమెరికాలో క్రైస్తవ మతస్థులు తగ్గుతున్నారు.  ఈ విషయాన్ని పివ్‌ రీసర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన అధ్యయనం ద్వారా తేల్చారు.  శతాబ్ధాలుగా అమెరికాలో శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థులు ఉండేవారు. అయితే అక్కడ ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా అనూహ్య రీతితో క్రైస్తవ మతం క్షీణిస్తున్నట్లు పివ్‌ తన నివేదికలో చెప్పింది. 2007లో సుమారు 78 శాతం మంది అమెరికా యువత తాము క్రైస్తవులమని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 63 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు.

                అమెరికాలో ఏయే మతస్థులు ఉన్నారో తెలుసుకునేందుకు  2007లో పివ్‌ రీసర్చ్‌ సంస్థ తొలిసారి స్టడీ చేపట్టింది. నాస్తికులమని చెప్పుకునే వాళ్లు, ఏ మతంతో సంబంధం లేదని చెప్పేవారి డేటా కూడా ఆ స్టడీలో పొందుపరిచారు.   అయితే గతంలో అయిదుగురిలో ఒకరు మాత్రమే వేరుగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు వేరన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. క్రిస్టియానిటీ ఎందుకు తగ్గుతుంతో పరిశోధకులు తమ స్టడీలో పేర్కొన్నలేదు. కానీ పశ్చిమ దేశాల్లో ఎక్కువ శాతం క్రైస్తవ మతం ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు అంచనా వేస్తున్నారు.  మతాన్నీ వీడుతున్న వారిలో ఎక్కువగా ప్రాటెస్టాంట్‌ క్రైస్తవులు ఉన్నారని, క్యాథలిక్‌ క్రైస్తవుల్లో పెద్దగా మార్పేమీ లేదని స్టడీలో తేల్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events