సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ తెలుసు కదా. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మేకర్స్ చెబుతూ అవుట్‌పుట్ చూసుకున్నాం. చాలా సంతృప్తికరంగా వచ్చింది. నెలరోజు ల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సిద్దు, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. తొలి పాటను సిద్ధు, రాశీఖన్నాలపై షూట్ చేశాం. నెక్ట్స్ లెన్తీ షెడ్యూల్ కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ ఇందులో న్యూ అండ్ స్టైలిష్ అవతార్‌లో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే స్పెషల్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ బాబా, సంగీతం: థమన్ ఎస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.