Namaste NRI

తండ్రైన మంచు మనోజ్‌

హీరో మంచు మనోజ్‌ తండ్రయ్యారు. ఆయన సతీమణి మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి తెలిపారు. మా ఇంట చిన్నారి దేవత అడుగుపెట్టింది. ఈ పాపను మేము ప్రేమగా ఎంఎం పులి అని పిలుస్తున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని, వారు ఎల్లప్పుడూ సంతోషంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నా అని మంచు లక్ష్మి పేర్కొంది. ఈ సందర్భంగా మంచు మనోజ్‌కు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు అభినందనలు తెలిపారు. పెద్దల అంగీకారంతో గత ఏడాది మంచు మనోజ్‌- మౌనికలు వివాహం చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events