Skip to main content

Namaste NRI

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో మెగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్‌ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. దర్శకుడు అనుదీప్‌ కెవి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ చిత్రం మెగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగిది. ఈ  ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ  ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రావడానికి ప్రధానమైన కారణం మా ఏడిద నాగేశ్వరరావు గారు. వారి ఆశీస్సులు మనం దరిపైన వుంటాయి. కంటెంట్‌ బావుంటే  ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్‌ల్లోకి వస్తారు. మంచి కథలు, కంటెంట్‌ పై దృష్టి పెట్టాల్సిన బాధ్యత దర్శకులపై వుంది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌, అలీ, సంచిత, ఏడిద శ్రీరామ్‌, రధన్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News