Skip to main content

Namaste NRI

తామా- తానా ఆధ్వర్యంలో ఉచిత ప్లూ వ్యాక్సిన్‌ క్యాంపు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా (తామా), తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 7న ఉచిత ప్లూ వ్యాక్సిన్‌ క్యాంపు నిర్వహించారు. తామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు  100 మందికి పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అనుభవజ్ఞులైన ఫార్మాసిస్టులు మితేశ్‌ పటేల్‌, సూర్య వంగపండు, స్మతి ఎంతో ఓపికతో వ్యాక్సిన్లు వేశారు. ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తామా, తానా  సభ్యులను పలువురు అభినందించారు. గతంలో తామా ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాల్లో 10 వేల మందికి పైగా లబ్దిపొందారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు  21 సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు తామా సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తామా అధ్యక్షుడు సాయిరామ్ కారుమంచి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సురేష్ బండారు, ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి, సునీత పొట్నూరు, శ్రీనివాస్ రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, శ్రీనివాస్ ఉప్పు, తానా ఆర్విపి మధు యార్లగడ్డ, శ్రీనివాస్ లావు, వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని, భరత్ మద్దినేని మరియు యువ వాలంటీర్లు   పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events