తైవాన్ తెలుగు సంఘం (టీటీఏ) ఆధ్వర్యంలో తైవాన్‌లోని హ్సించు నగరంలో తెలుగు వారంతా కలిసి ఘనం గా ఉగాది వేడుకలను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్ర మంలో సాంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు నోరూరించే వంటకాలను నిర్వాహకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. విభిన్నమైన ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. ఇండియా తైపీ అసోసియేషన్ (ఐటీఏ) నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సౌమిత్ రాజు, రోహిత్ ముఖ్య అతిథులుగా వ్యవహరించిన ఈ ఉగాది సంబరాల్లో తైవాన్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు మనోజ్ శ్రీరామోజు, సత్యం కామని, ఏడుకొండలు, రఘు పుటికం, రామ కృష్ణ వందవాసి, ముకేశ్ బాడిగినేని, శైలజ చౌదరి, నాగవిజయ గోగినేని, రాజు నాయిక్, యోగపాల్, నాగార్జున, నాగతేజ, చందు కాకర్ల, భారతీయులతో పాటు తైవాన్ దేశస్థులు, ఇతర దేశస్థులు కలిసి సుమారుగా 200 మంది ఈ ఉగాది వేడుకల్లో పాలు పంచుకున్నారు.