ఆన్‌లైన్ రిటైలర్ దిగ్గజం అమెజాన్‌పై భారీ ఫైన్ పడిరది. యూరోపియన్ యూనియన్ సమాచార భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకుగానూ జూలై 16న దాదాపు రూ.6.543 కోట్ల జరిమానాను లగ్జెంబర్గ్ అధికారులు విధించినట్లు అమెజాన్ తెలిపింది. ప్రకటనల కోసం తమ అనుమతులు లేకుండా డేటా సేకరించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఈయూ అధికారులు చెప్పారని తెలిపింది. దీనిపై తాము న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొంది. జీడీపీఆర్ అనే సమాచార భద్రతా చట్టం కింద యూరోపియన్ యూనియన్ ఈ జరిమానా విధించింది.