Namaste NRI

ఈ షరతులకు సరేనంటే చర్చలకు ఓకే

 రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమేననీ, కొన్ని షరతులకు అంగీకరిస్తే చాలాని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఆక్రమించుకున్న ప్రాంతాలను  రష్యా తమకు తిరిగి అప్పగించాలని, యుద్ధం వల్ల కలిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుద్ధ నేరాలపై విచారణను రష్యా ఎదుర్కోవాలంటూ మరో షరతు విధిచారు. రష్యా కూడా ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని చెబుతోంది. ఖేర్సన్‌ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన రష్యా,  ఆ మేరకు కార్యచరణ మొదలైందని తెలిపింది. అన్ని రకాల సరఫరా వ్యవస్థల్ని తాము నాశనం చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రష్యా అక్కడి ఉంచి వైదొలగుతోందని ఉక్రెయిన్‌ సాయుధ దళాల కమాండర్‌`ఇన్‌ చీఫ్‌ వలెరీ జలురీa్న అన్నారు.  ఖర్సేన్‌లో పెద్దఎత్తున మందుపాతరలను రష్యా అమర్చిందనీ, దానిని మృత్యునగరంగా మార్చాలనుకుంటోందని ఉక్రెయిన్‌ అనుమానిస్తోంది. రష్యా సైనికులు ప్రశాంతంగా వెనుదిరిగేందుకు ఉక్రెయిన్‌ అవకాశం కల్పిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events