Skip to main content

Namaste NRI

జో బైడెన్‌నుని చంపాలనుకున్న భారత సంతతి యువకుడుకి జైలుశిక్ష!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపేందుకు ప్లాన్‌ చేసిన భారత సంతతి యువకుడు సాయివర్షిత్‌ కందుల (19)కు దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఓ ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడికి యత్నించిన సాయివర్షిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఫెడరల్‌ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆరెంజ్‌ కలర్‌ జంప్‌ సూట్‌లో న్యాయస్థానానికి వచ్చిన సాయి వర్షిత్‌ జడ్జి రాబిన్‌ మెరివెదర్‌ అడిగిన ప్రశ్నలకు వినయంగా సమాధానాలు చెప్పాడు. అయితే తనపై ఆస్తుల ధ్వంసం, ర్యాష్‌ డ్రైవింగ్‌, ప్రెసిడెంట్‌ను చంపేస్తానని బెదిరించడం, అనుమతి లేకుండా వైట్‌హౌస్‌లోకి చొరబడటం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయని సాయివర్షిత్‌కు జడ్జి తెలిపారు. ఈ నేరాలకు గానూ గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అలాగే మే 30 దాకా సాయివర్సిత్‌ను కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Social Share Spread Message

Latest News