విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం లవ్ గురు. మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ ఆంటోనీ మాట్లాడారు.లవ్ గురు కథ విన్నాక ఇది నా కెరీర్‌లో బిచ్చగాడు తర్వాత అంత పెద్ద హిట్ అవుతుం దని దర్శకుడు వినాయక్‌కు చెప్పాను. మృణాళిని మంచి నటి. ఈ సినిమాలో తన నటన మీ అందర్నీ ఆకట్టు కుంటుంది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పగలను.ఇక భరత్ మ్యూజిక్ సూపర్ అన్నారు. ఇందులో నా పాత్ర పేరు లీల. నా కెరీర్‌లో లభించిన గొప్ప పాత్ర ఇది. హీరోతో సమానమైన ప్రాధాన్యత నా పాత్రకు ఉంటుంది. న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నన్ను యాక్టింగ్ క్లాసులకు పంపారు విజయ్ ఆంటోని.ఈ సినిమా చూశాక మీ లైఫ్ పార్ట్‌నర్స్‌తో మీరు మరోసారి ప్రేమలో పడతారు అని మృణాళిని రవి చెప్పారు.
అనుకోకుండా విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన ఊహించని ఫోన్ కాల్ తన కెరీర్‌ని మార్చేసిందని, ప్రేమ ద్వారా యూనివర్స్‌లో ఏదైనా సాధ్యమే అనే అంశాన్ని ఈ కథలో చెబుతున్నామని, నేటి జనరేషన్ ఆడియన్స్ కి ఈ సినిమా అంకితం ఇస్తున్నానని దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెలిపారు. ఇంకా మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు: నవీన్ యర్నేని, రవిశంకర్, రచయిత భాష్యశ్రీ, సంగీత దర్శకుడు భరత్ ధనశేఖర్, ఇంకా మైత్రీ పంపిణీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ నెల 11న సినిమా విడుదల కానుంది.