Namaste NRI

కలి టీజర్‌ని ఆవిష్కరించిన నాగ్‌అశ్విన్‌  

యువహీరోలు ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య నటిస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కలి. శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్‌వర్మ నిర్మాత. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ ను అగ్ర దర్శకుడు నాగ్‌అశ్విన్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. చిత్రయూనిట్‌కి నాగ్‌అశ్విన్‌ శుభాకాంక్షలు అందించారు. టీజర్‌ ద్వారా ఉత్పన్నమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోడానికైనా సినిమా చూడాలని ఉందని ఆయన అన్నారు. మైథాలజీతో కూడిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఇదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నదని త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నిషాంత్‌ కటారి, రమణ జాగర్లమూడి, సంగీతం: జీవన్‌బాబు, సమర్పణ: కె.రాఘవేంద్రరెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events