Skip to main content

Namaste NRI

నేచర్ మూవీ.. ఆలీ చేతుల మీదుగా నిన్నే చూడందే లిరికల్ సాంగ్ లాంచ్

కృష్ణ, ముస్కాన్‌ రాజేందర్‌ జంటగా నటించిన చిత్రం నేచర్‌.  అశ్విన్‌ కామరాజు కొప్పల దర్శకుడు. ఈ చిత్రాన్ని సి.యశోదమ్మ, టి.చేతన్‌ నిర్మించారు. అజయ్‌ ఘోష్‌, గౌతమ్‌ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమాలోని నిన్నే చూడందే అనే లిరికల్‌ సాంగ్‌ను హాస్య నటుడు ఆలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టైటిల్‌ చాలా బాగుంది. ప్రకృతి బాగుంటే మనమంతా బాగుంటాం. ఆ పాట వింటుంటే నాకు ఇళయరాజా గీతాలు గుర్తొస్తున్నాయి అన్నారు. దర్శకుడు కామరాజు కొప్పల మాట్లాడుతూ ప్రకృతిని ఇష్టపడే యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ వల్ల అతను ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడు? చివరకు ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? అన్నదే మా నేచర్‌ సినిమా కథాంశం అన్నారు. అనంతరం  దర్శకుడు చిరత విశేషాలు తెలియజేస్తూ ప్రకృతి బాగుంటే  అన్ని బాగుంటాయి. ఎలాంటివి విపత్తులు రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఉంటారనే అంశాన్ని ప్రేమకథా నేపథ్యంలో చూపించాం అన్నారు. కథా రచయితలు సుధాకర్‌ తుపాకుల, రవి చల్లా మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడే బాధ్యతను తీసుకోవాలనే చక్కటి సందేశంతో ఈ కథా రాశాం అని చెప్పారు. ఈ చిత్రాకిని కెమెరా: వవిజయ్‌ ఠాగూర్‌, సంగీతం: ఎం.ఎల్‌.రాజ, నిర్మాణ సంస్థ: శ్రీ సప్తమ్‌ క్రియేటివ్‌ ప్రొడక్షన్‌. ఈ కార్యక్రమంలో యం.యల్‌.రాజా, కృష్ణుడు, కాశీ విశ్వనాథ్‌, సుధాకర్‌ తుపాకుల, రవి చల్ల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events