Skip to main content

Namaste NRI

ఒక్క ఫ్రేమ్‌ కూడా బోర్‌ కొట్టదు

వెంకటేశ్‌ పెద్దపాలెం, అపర్ణ, మల్లిక్‌, హీనా సోని ముఖ్యతారలుగా రూపొందిన యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా వన్‌ బై ఫోర్‌. బాహుబలి పళని కె. ఈచిత్రానికి దర్శకుడు. రంజన రాజేష్‌ గుంజల్‌, రోహిత్‌ రాందాస్‌ గుంజల్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్‌ పెద్దపాలెం మాట్లాడుతూ టంగ్‌ స్లిప్‌ అనే పాయింట్‌తో ఈ క్రైమ్‌ డ్రామాను తీశాం. బాహుబలి కి పని చేసిన పళని టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి స్టైల్లో తీశారు. ఒక్క ఫ్రేమ్‌ కూడా బోర్‌ కొట్టించుకుండా సినిమాను తీశారు. ఈనెల 12న వంద శాతం మేం హిట్‌ కొట్టబోతోన్నాం అని అన్నారు.

కథే ఈ టీమ్‌ని కలిపిందని, టెక్నికల్‌గా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అందర్నీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా అపర్ణ మల్లిక్‌, హీనా సోని, కొరియోగ్రాఫర్‌ సాగర్‌ వేలూరు కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News