తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కొలరాడోలోని డెన్వర్ పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాబు కోసం మేము సైతం అంటూ ప్లకార్డులు పట్టుకొని ఎన్నారైలు నినాదాలు చేశారు. డెన్వర్ వీధుల్లో పెద్దలు, పిల్లలు, మహిళలు, యువత చంద్రబాబుకు మద్దతుగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డెన్వర్ కొలరాడో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
















