అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం పుష్ప-2 ది రూల్. రష్మిక మందన్న కథానాయిక. దర్శకుడు సుకుమార్. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి విశేషమైన లభిస్తున్నదని, బన్నీ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని, టాలీవుడ్‌లో ఇంత విభిన్నంగా ఒక హీరో కనిపించడం ఇదే ప్రథమమని, ఒక్క టీజర్‌తో బన్నీ అంచనాలు పెంచేశారని మేకర్స్ చెబుతున్నా రు. ఈ టీజర్‌లో బన్నీ చీరకట్టి, కాలు వెనక్కి మడిచి, పైటకొంగును అందుకున్న తీరు తీస్తుంటే, పుష్ప ను ఈ సినిమా అధిగమించడం ఖాయం అనిపిస్తున్నది. టీజర్‌లో బన్నీ యాటిడ్యూడ్, దేవిశ్రీ నేపథ్య సంగీతం మరో సారి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఒక్కమాటలో చెప్పా లంటే ఈ సినిమా బన్నీ విశ్వరూపం. ఆగస్ట్ 15న పండుగ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి అని చిత్ర బృందం పేర్కొంది.