Skip to main content

Namaste NRI

రాజమండ్రి రోజ్‌ మిల్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

జై జాస్తి, అనంతిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం రాజమండ్రి రోజ్‌ మిల్క్‌. సన్నీల్‌ కుమార్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, ప్రణీత్‌ పట్నాయక్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రచారంలో భాగంగా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా..ఉండే నిండుగా ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూసినట్టుగా అనే సాంగ్‌ను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ గీతాన్ని చంద్రబోస్‌ రాశారు. అజయ్‌ అరసాడ బాణీలు అందించారు. పాటకు అందరి నుంచి మంచి స్పందన లభిస్తోంది. వినోదాత్మకంగా రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం. అందరికీ కాలేజీ రోజులు గుర్తుకు తెస్తుంది అంటున్నాయి సినీవర్గాలు. ఈ చిత్రాని  నాని బండ్రెడ్డి దర్శకుడు. డి.సురేష్‌ బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం: గోవింద్‌ వసంత్‌, అజయ్‌ అరసాడ, యశ్వంత్‌ నాగ్‌, భరత్‌` సౌరభ్‌, డీఓపీ: ముఖేష్‌.జి, శక్తి అరవింద్‌, సాహిత్యం: చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌. శ్రీమణి. ప్రొడక్షన్‌ డిజైనర్‌: అభిషేక్‌ రాఘవ్‌.

Social Share Spread Message

Latest News