ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా సార్ ( తమిళంలో వాతి). శ్రీకరణ స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంవీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి మాస్టారు మాస్టారు నా మనుసును గెలిచారు. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మాస్టారు ధనుష్‌ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్‌కు ధనుష్ సాహిత్యం అందించడం విశేషం.














