అమెరికాలోని చికాగోలో ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్ అడలినా అత్యంత ఖరీదైన లగ్జరీ కాక్‌టెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. హై ఎండ్ జ్యూయలరీ బ్రాండ్ మారో ఫైన్‌తో కలిసి మారో మర్టిని పేరుతో దీనిని ఈ నెల 9 నుంచి విక్రయిస్తున్నది. దీని ధర 13,000 డాలర్లు (రూ.10 లక్షలకు పైగా). అడలినా రెస్టారెంట్ జనరల్ మేనేజర్ కోలిన్ హోఫర్ దీనిని తయారు చేశారు. దీనితోపాటు మారో ఫైన్ తయారు చేసిన 9 క్యారెట్ల డైమండ్ టెన్నిస్ నెక్లెస్‌ను ఇస్తారు. 14 క్యారెట్ల బంగారం మీద 150 వజ్రాలతో కూడిన నెక్లెస్ ఇది. ఫైన్ జ్యూయలరీ, లగ్జరీ డైనింగ్‌ను ఆస్వాదించేలా చేయడమే మారో మర్టిని ప్రత్యేకత.