భారత సంతతికి చెందిన బ్రిటన్ విద్యావేత్త, బ్రిటన్ ఎగువ సభ సభ్యుడు అజయ్‌కుమార్ కుక్కర్‌కు నైట్ కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంఫైర్ (కేబీఈ) పురస్కారం లభించింది. బ్రిటన్‌లో వార్షిక నూతన సంవత్సర పురస్కారాల జాబితాలో ఇది రెండో అత్యున్నత పురస్కారం. లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో శస్త్రచికిత్స ఆచార్యుడిగా పనిచేస్తున్న 57 ఏళ్ల కక్కర్‌కు ఆరోగ్య రంగంలో చేసిన సేవలకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈ దఫా జాబితాలో చోటు దక్కినవారిలో ఎక్కువ మంది కొవిడ్ సంబంధిత అంశాలతో సంబంధం ఉన్నవారు కావడం విశేషం. వారితో పాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులూ ఎక్కువగా ఉన్నారు. ఈ మేరకు విడుదల చేసిన జాబితాల్లో సుమారు 1,278 మంది ఉండగా, వారిలో 50 మంది వరకు భారత సంతతి వృత్తి నిపుణులు ఉన్నారు.














