Skip to main content

Namaste NRI

ఈ సినిమా ఎవ్వరినీ నిరాశపరచదు :ఆది సాయికుమార్‌  

ఆది సాయికుమార్‌  కథానాయకుడిగా నటించిన సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ శంబాల. ఎ మిస్టికల్‌ వరల్డ్‌ ఉపశీర్షిక. యుగంధర్‌ ముని దర్శకుడు. రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్‌ మాట్లాడారు. ప్రభాస్‌, దుల్కర్‌ సల్మాన్‌, రానా, సందీప్‌ కిషన్‌, యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ వీరంతా మా సినిమా విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. కొండంత మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. వారందరికీ కృజ్ఞతలు తెలుపుతున్నా. అందరినీ ఆకట్టుకునే కంటెంట్‌ ఇది. దర్శకుడు యుగంధర్‌ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఎవ్వరినీ ఈ సినిమా నిరాశపరచదు  అని నమ్మకంగా చెప్పారు.

ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వచ్చిందని, సాంకేతికంగా గొప్పగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు యుగంధర్‌ తెలిపారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల కథానాయిక అర్చన అయ్యర్‌ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నటులు రవివర్మ, ఇంద్రనీల్‌, మధునందన్‌ కూడా మాట్లాడారు. డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News