Skip to main content

Namaste NRI

అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే

అమెరికాలోని నార్త్‌ కరోలినాలో నివాసముంటున్న గినా డిల్లార్‌ (55) మహిళ రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది.  తల్లితో కలిసి గ్రాసరీ షాప్‌కు వెళ్లింది. అయితే సరదా ఫాస్ట్‌ ప్లే గేమ్‌ ఆడమని డిల్లార్డ్‌కు ఆమె తల్లి సూచించింది. అంతకుముందు ఎప్పుడూ డిల్లార్డ్‌ ఆ ఆట ఆడలేదు. కానీ తల్లి చెప్పింది కదా అని సరదాగా 5 డాలర్లు పెట్టి టికెట్‌ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృష్టవశాత్తు ఆమే గెలిచింది. 2,54,926 డాలర్ల జాక్‌పాట్‌ కొట్టింది.  భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.2 కోట్లకు పై మాటే.  తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్‌ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని పేర్కొంది. గెలిచిన డబ్బుతో హోం లోన్‌, కారు లోన్‌ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది.

Social Share Spread Message

Latest News