Skip to main content

Namaste NRI

రేపు రెండో దశ ఎన్నికల పోలింగ్‌

లోక్‌సభ రెండోదశ ఎన్నికలు శుక్రవారం (ఏప్రిల్ 26న) జరుగనున్నది. ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో దశ ఎన్నికలు 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో జరునుండగా, లక్షలాది మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో 6, బీహార్, అస్సాంలో ఐదు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమలో మూడు స్థానాలకు పోలింగ్‌ జరుగనున్నది. అలాగే త్రిపుర, జమ్మూ కశ్మీర్‌లో ఒక్కో స్థానానికి, మణి పూర్‌లోనూ రెండోదశ పోలింగ్‌ జరుగనున్నది.

Social Share Spread Message

Latest News