Skip to main content

Namaste NRI

విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌ టీజర్‌ డేట్‌ వచ్చేసింది

వెంకటేష్ హీరోగా , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ సైంధవ్. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లతో కూడిన భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో విడుదలైన చిత్రం గ్లింప్స్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. టీజర్ ప్రేక్షకులకు సైంధవ్  వరల్డ్ గురించి ఇన్ సైట్ ఇవ్వనుంది. ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events