Skip to main content

Namaste NRI

డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంకీపాక్స్‌ వైరస్‌పై కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలకు వైరస్‌ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా (ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితి) ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ మంకీపాక్స్‌ వ్యాధిని అసాధారణ పరిస్థితిగా పేర్కొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌ ప్రస్తుతం భారత్‌ణు భయపెడుతోంది. దాదాపు 70 దేశాలకు మంకీపాక్స్‌ విస్తరించింది. ఒక్క యూరపియన్‌ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు భారత్‌లో మూడు మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోద్వడం గమనార్హం.  16 దేశాల్లోని మనషుల్లో మంకీపాక్స్‌ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ విస్తరించింది.

Social Share Spread Message

Latest News