సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాద సంస్థ దాడులకు దిగింది. దీంతో తమ మిత్ర దేశం, తాజా మక్కా కూటమిలో సభ్య దేశమైన సౌదీపై జరుగుతున్న ఈ దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే తాము కూడా దాడి చేస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌కు చెందిన ఉగ్రసంస్థ హౌతీ, సౌదీ అరేబియాపై దాడి చేస్తోంది.

ఇతర గల్ఫ్ దేశాలపై కూడా దాడికి దిగుతోంది. దీంతో ఈ దాడులపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఇటీవలే పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా కలిసి మక్కాలో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మూడు దేశాలు కలిసి సైనిక, రక్షణ పరమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఈ మూడు దేశాల్లోని ఏ దేశంపై దాడి జరిగినా అది తమ అందరిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఇటీవల ఒప్పందం సందర్భంగా ప్రకటించాయి. కూటమిలోని ఒక దేశానికి మద్దతుగా, మిగతా దేశాలు కూడా దాడి చేస్తామని ప్రకటించాయి.















