Skip to main content

Namaste NRI

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆచార్య కొత్త పోస్టర్ విడుదల

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పాట తాలూకు ఈ స్టిల్‌లో చిరంజీవి హుషారుగా నటిస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఆచార్యడిగా, నక్సలైట్‌గా భిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారని చెబుతున్నారు. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందిస్తున్నారు. తిరుణ్ణావుక్కరుసు ఛాయాగ్రహణం బాధ్యతల్ని నిర్వరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకుడు. రామ్‌చరణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events