Skip to main content

Namaste NRI

బాలకృష్ణ అఖండ మూవీ ట్రైలర్ విడుదల

నందమూరి బాలకృష్ణ, స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్‌ మూవీ అఖండ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాలకృష్ణ అఘోరాగా, సాధారణ వ్యక్తిగా రెండు భిన్న పార్శాల్లో కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. బాలయ్య డైలాగ్‌లకు అందరూ విజిల్స్‌ వేయాల్సిందే. విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు అంటూ ట్రైలర్‌ మొదలవుతుంది. ఇందులో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నాకు బురద అంటింది. నాకు దురద వచ్చింది..నాకు బ్లడ్‌ వచ్చింది. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే అంటూ శ్రీకాంత్‌ కూడా తన విలనిజాన్ని చూపించారు.

                రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు. జగపతి బాబు తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక ట్రైలర్‌ లో తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది.  ప్రగ్యా జైస్వాల్‌ నటించిన ఈ చిత్రాన్ని ద్వారకా  క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవిందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. అఖండ చిత్రాన్ని డిసెంబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ట్రైలర్‌ అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events