Namaste NRI

బైడెన్ సర్కారు తీపి కబురు… హెచ్ -1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు

అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుకుంటున్న భారతీయులకు అధ్యక్షుడు జో బైడెన్ సర్కారు తీపి కబురు తెలిపింది. వలసదారులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమెటిక్ వర్క్ ఆథరైజేషన్ కింద అనుమతులు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయులతో పాటు అనేక మంది వలసదారులు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు తొలగిపోయాయి. ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరపున అమెరికన్  ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) వేసిన పిటిషన్పై అక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సానుకూలంగా స్పందించింది. 
	హెచ్-1బీ, ఎల్ -1 వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు వర్క్ ఆథరైజేషన్ పర్మిట్లపై 180 రోజుల వరకు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ను అనుమతించాలని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)ను యూఎస్ కోర్టు ఆదేశించింది. కనుక ఇకపై హెచ్-4 వీసాలు కలిగిన హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు వర్క్ ఆథరైజేషన్ పర్మిట్ల పొడిగింపు విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 
Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events