Skip to main content

Namaste NRI

బ్లాక్‌మెయిల్‌ చేస్తే సహించేది లేదు.. ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌

హర్మూజ్‌ జలసంధి ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. జలసంధి అంశాన్ని తీసుకుని అమెరికాను బ్లాక్‌మెయిల్ చేయాలని ప్రయత్నించవద్దని స్పష్టంగా హెచ్చరించారు. వైట్‌హౌస్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు.

ఈ తరుణంలోనే ఇరాన్‌ పాలకులు జలసంధిని మళ్లీ మూసివేయాలనే చర్యలకు దిగుతున్నారని ట్రంప్‌ మండిపడ్డారు. గతంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారని, అయితే అమెరికాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురిచేయలేరని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ శాంతి చర్చల విషయంలో మరో ప్రకటన చేసింది. అమెరికా ప్రతిపాదించిన కొత్త ఆఫర్లను పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆ ప్రతిపాదనలను తమకు అందజేశారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Click Here
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events