
ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ (సీజ్ ఫైర్)ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. అమెరికా – ఇరాన్ మధ్య ఈ నెల 8వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల ఈ సీజ్ ఫైర్ మరో కొద్ది గంటల్లో ముగియనుందనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాకిస్థాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్లుగా ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు సైనిక చర్యను వాయిదా వేసి, దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.















