Namaste NRI

ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది : తిరువీర్‌

తిరువీర్‌ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ పాపం ప్రతాప్‌. ఎస్‌పీ దుర్గ నరేష్‌ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. తిరువీర్‌ మాట్లాడుతూ కుటుంబసమేతంగా కలిసి చూసే మంచి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ ఇదని, ఈ సినిమా మీతో మాట్లాడటమేకాక, మీరు మాట్లాడేలా చేస్తుందని దర్శకుడు ఎస్‌పీ దుర్గనరేశ్‌ చెప్పారు. ఇంకా ఈటీవీ విన్‌ ప్రతినిధి సాయికృష్ణ, మైత్రీ శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events