Skip to main content

Namaste NRI

సంక్రాంతి బరిలో బంగార్రాజు

సంక్రాంతి బాక్సాఫీస్‌ బరిలో నిలిచాడు బంగార్రాజు. నాగార్జున, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు. కొత్త సంవత్సరం సందర్భంగా టీజర్‌ను విడుదల చేసి, సంక్రాంతి పండక్కి చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఊరుకోవే పుటికి కితకితలెడుతున్నాయ్‌ అంటూ నాగార్జున చేసిన సందడి, దేశానికే  సర్పంచి కావాలంటూ నాగచైతన్య చేసిన అల్లరి నవ్వులు పూయించేలా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. 2016 సంక్రాంతికి విడుదలై, మంచి హిట్‌  సాధించిన సోగ్గాడే చిన్ని నయనా సినిమాకు స్రీక్వెల్‌గా బంగార్రాజు చిత్రం రూపొందింది. సోగ్గాళ్లుగా తండ్రీ తనయుల హంగామా ఎలా ఉంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events