Skip to main content

Namaste NRI

ఏడేళ్ల తర్వాత ఉపేంద్ర కొత్త చిత్రం

ఉపేంద్ర విలక్షణ నటుడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత తాజాగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమాతో ప్రొడక్షన్‌ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది లహరి మ్యూజిక్‌. దీన్ని ఎల్‌ఎల్‌పి వీనస్‌ ఎంటర్‌టైన్స్‌ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించనుంది. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.  ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను సామాజిక మధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో ఉపేంద్ర కొమ్ములు తిరిగిన గుర్రంపై కూర్చొని ఆసక్తికరంగా కనిపించారు. దీంట్లో ఆయన లుక్‌, చుట్టూ ఉన్న శ్మశాన వాతావరణం, ఆకాశంలో కనిపించే శాటిలైట్‌ ఇలా ప్రతిదీ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ నేను ఉపేంద్ర లాంటి కథ సృష్టించినా, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాసినా దానికి అభిమానులే కారకులు. వారి ఈలలు, కరతాళ ధ్వనులే నన్ను దర్శకత్వం వహించేలా చేశాయి. అందుకే  ఇప్పుడీ భారతీయ చిత్రాన్ని సినీ అభిమానులకు అంకితం చేస్తున్నాను. భారీ సంస్థల నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా భారతీయ ప్రేక్షకులు ఇష్టపడతారని కచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు. ఉపేంద్ర ఎ చిత్రం నుంచి ఆయనతో మాకు మంచి అసోసియేషన్‌ ఉంది అన్నారు లహరి మ్యూజిక్‌ గ్రూప్‌ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి. మనోహరన్‌. దేశవ్యాప్తంగా ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుంది అన్నారు వీనస్‌ ఎంటర్‌టైన్మ్‌ంట్స్‌ శ్రీకాంత్‌.

Social Share Spread Message

Latest News