Skip to main content

Namaste NRI

పుట్టిన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు క్యాంప్ కార్యాలయంలో టీటీడీ, దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్యా చౌదరి, దుర్గగుడి ఈఓ శ్రీ శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌లో పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అంతకుముందు సతీమణి శ్రీమతి భువనేశ్వరి తో కలిసి లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు. క్యాంటీన్‌కు వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు.తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరి తో కలిసి చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు.

Social Share Spread Message

Latest News